హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: హైదరాబాద్ వనస్థలిపురంలో తెల్లవారు జామున దారుణం జరిగింది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పాల వ్యాపారి భుజంగరావు (60)పై కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గుర్రంగూడకు చెందిన భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా ఆయన ఇంటి పక్కనే ఉండే శివేందర్ సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం యాక్టివాపై భుజంగ రావు పాలు తీసుకెళ్తుండగా శివేందర్ సింగ్ కత్తితో దాడి చేశాడు. అనంతరం శివేందర్ సింగ్ నేరుగా పోలీస్ స్టేషన్ కువెళ్లి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన భుజంగరావును హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





