– పాల్గొననున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, ఆచార్యులు
– కాలుష్య నియంత్రణకు బహుళ సంస్థల సమన్వయమే లక్ష్యం
– కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం
కాళోజీజంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, ఆగష్ణు 3 : కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణో త్వ వాన్ని యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, స్టేట్ ఎక్సేవర్డ్ ఆప్టికల్ కమిటీ, తెలంగాణ పా ట్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సం యుక్త ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేయూ స్టార్ ఆచార్య వి. రామచంద్రం, సదస్సు సర్వ హణ కమిటీ చైర్మన్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యులు ఆచార్య గాడె దయాకర్ తెలిపారు. సోమవారం కెమిస్ట్రీ విభాగంలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో వారు మాట్లాడుతూ,” సినర్జెసింగ్ న్స్టిట్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సైలజిక్ అండ్ మల్టీస్టేక్ హోల్డర్ అప్లోడ్ పొల్యూషన్ కంట్రల్) అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ వ రిరక్షణ, కాలుష్య నియంత్రణ, స్థిరమైన అభి వృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వ సంస్థలు, పది క్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థల న మన్వయానికి ఈ సదస్సు వేదికగా విలుస్తుం ధని పేర్కొన్నారు. ఆగస్టు 12న నిర్వహించే ఫ్రీ-కాస్ఫరెన్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ వైస్-ఛాన్సలర్ ఆచార్య రవీంద్రనాథ్ ప్రారంభోపద్యానం చేయనున్నారు. ఈ సంద ర్భంగా జీడిమెట్ల జెఈటిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బక్కారెడ్డి, హైదరాబాద్ టి ఎస్.డి.ఎఫ్ ప్రాంతీయ అధిపతి డాక్టర్ రాధాకృష్ణ సాయి, హెటెరో డ్రగ్స్ సీనియర్ జనరల్ మేనేజర్డాక్టర్ ఈ.హెచ్.ఎస్.హరి, ఆచార్య పి.వి. రావు, ఆచార్య శ్రీధర్ ప్రసంగించమన్నారు. గస్టు 13న జరిగే ప్రారంభ సదస్సుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరపుతారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జి.రవి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్య కార్యదర్శి డాక్టర్ బి.సెస్ గుప్తా, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ సుందర్ రామనాథన్, తెలంగాణ ప్రధాన అటవీ సంరక్షణాధికారి ప్రియాండ వర్లీష్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సాంబశివరావు నాయుడు, తెలంగాణ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగిరు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల నుంచి ఇప్ప టికే 150 మంది ప్రతినిధులు నమోదు చేసుకు న్నారని తెలిపారు. ఎంపికైన పరిశోధన పత్రాల ను ప్రత్యేక కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ రూపంలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సదస్సు లో సాంకేతిక సమావేశాలతో పాటు ప్యానెట్ చర్యలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎడ్. వాసుదేవ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మమత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





