బడి ముఖమే తెలియని
గొప్ప విద్యావేత్త.

దేశ సంచారం చేయని
ప్రపంచ జ్ఞాని

దేహం కనిపించని
గొప్ప సౌందర్యం.

అపరిమిత వేగంతో
ప్రయాణించే అద్భుతనౌక

ఎంతటి మనిషినైనా
బానిసగా మార్చుకుని

ఏ కాలాన్ని నైనా
ఘాటుగా పాలించే నియంత.

కఠినంగా మాట్లాడి
మెత్తగా పాటిస్తూ

మెత్తగా మాట్లాడి
కఠినంగా వ్యవహరిస్తూ

ఎంత లోతుగా తవ్వి తోడినా
అణువంత అర్దం కాని చిరునామా

తరాల అన్వేషణను
ఓడించే రహస్యం ‘‘మనసు’’

– చందలూరి నారాయణరావు
      9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *