నీవు కత్తిని నమ్మావు
వాడు శాంతిని నమ్మాడు
నీవు తూటాను నమ్మావు
వాడు ఓటును నమ్మాడు
నీవు పోరుతో రాజ్యమన్నావు
వాడు ఓటుగెలుపుతో గద్దె అన్నాడు
నీ దారి అడవి ముళ్లదారి
వాడిదారి నల్లేరుపై నడక…
పంచసప్తతి దాటిన
అడవులు తగలబడుతున్నాయి
ఆకలి పులికి బలి అవుతునే ఉన్నారు
నేలపై నెత్తుటి మరకలు పరుచు కున్నా
ఆశల పంటలు పరులపాలు అవుతున్నా
నిశబ్ధం మౌనం అచేతనం మూడు కోతులు
కదలక వదలక ఉడుములా పట్టుకున్నాయి…
వాడు నీవు కలిస్తే
ఎండుతున్న పైరుపై వర్షం కురిసి నట్లే
పచ్చదనంలో స్వేచ్ఛకేకి పురివిప్పినట్లే
– రేడియమ్
9291527757





