– ‘సమ్మిట్’ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై మంగళవారం ఆయన సమీక్షించారు. నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో రాష్ట్ర ప్రతిష్ఠ ప్రపంచస్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 29న దిల్లీలో జరగనున్న కర్టెన్ రైజర్ కార్య¿మ్రాన్ని విజయవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సాధించిన విజయాలను వివిధ రంగాల ప్రముఖులు, అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలుచోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు. క్లైమేట్ ఛేంజ్, ఏఐ రంగాలకు సంబంధించిన ప్రపంచస్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలన్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో డిజైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు సూచించారు. కాకతీయ కళా తోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు. సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి.అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





