పసికందు మృతి
మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల హాస్టల్లో కలకలం
పర్యవేక్షణ లోపంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
మహబూబాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : మహబూబాబాద్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల వసతి గృహం (Mahabubabad Tribal Welfare degree College Hostel )లో ఓ డిగ్రీ విద్యార్థిని ప్రసవించిన ఘటన బుధవారం తీవ్ర కల కలం రేపింది. కళాశాల ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జులైలో కళా శాలలో చేరిన సదరు విద్యార్థిని బుధవారం ఉదయం అసెంబ్లీ సమయంలో గదిలో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను గమనించిన సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ప్రసవం జరగగా, పుట్టిన శిశువు మృతి చెందింది. ప్ర స్తుతం హాస్పిటల్లో విద్యార్థినికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులతో పాటు ఐసీడీఎస్, వైద్య, పోలీ సు శాఖలకు సమాచారం అందించామ ని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ప్రిన్సిపల్ వెల్లడించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
విద్యార్థినికి ప్రసవం జరిగే వరకు కళాశాల, హాస్టల్ యాజమాన్యం ఏం చేస్తోందంటూ పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో విద్యార్థినులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయ ని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్ సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





