గిరియానం – 24
అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా ఇండో బార్డర్ కు వెళ్ళడానికిఅప్పటిదాకా మేం ప్రయాణించిన వాహనానికి అనుమతి లేనందువల్లరాహుల్ మరో వాహనాన్ని తీసుకు వచ్చాడు. వాహనానికి విడిగా ఐదువేలరూపాయలు చెల్లించాలి. దానితోపాటు ప్రత్యేక అనుమతి కూడా తీసు కోవాలి. ఆ ప్రదేశం పదిహేనువేల రెండు వందల అడుగుల ఎత్తులోఉండడం, ఇరుకైన పర్వతశ్రేణుల్లో ప్రయాణించాలి కనుక ప్రత్యేకరిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారట. ఈ జీప్ డ్రైవర్ కొడుకుకుఆరోగ్యం బాగాలేనందువల్ల తాను కొంతదూరం వచ్చి మా డ్రైవర్ రాహల్ కేజీప్ అప్పగించి వెళ్ళిపోయాడు. ఉదయం ఏడుగంటలకు మా ప్రయాణం మొదలైంది.ఎటుచూసినా ఎత్తైన పర్వతాలు, భిన్న వర్ణం పువ్వులు, దారి పొడుగునా మిలిటరీ ఆనవాళ్ళు, సరస్సులు, జలపాతాలతో దారి అంతా చూపుతిప్పనివ్వ లేదు. పర్పుల్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ సమయంలో ఇక్కడమాత్రమే వికసిస్తాయట. చిన్న చిన్న తెల్లని పువ్వులు ఆకాశం నుంచితారలు రాలి పడినట్లుగా అంతటా విస్తారంగా వికసించి ఉన్నాయి.
ఉదయం పదిగంటలకు ” షెంగ్స్టర్ త్సో “లేక్ కు చేరుకున్నాం. ‘ త్సో ‘ అంటే టిబెటన్ భాషలో ‘ సరస్సు ‘ అని అర్థం. తవాంగ్గ్రామం నుంచి సుమారు ముప్ఫై కిలోమీటర్ల దూరం. మాకు దాదాపుమూడు గంటల సమయం పెట్టింది. పన్నెండువేల నాలుగువందల అరవైయేడు అడుగుల ఎత్తులో పర్వతాల నడుమ ఉన్న అందమైన సరస్సుఇది. 1950 ఆగస్టు 15 తేదీన 8.6 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చిందట. అపుడు కొండలు విరిగిపడి లోయలోని ఒక వాగుకు అడ్డo పడ్డాయి. అలానీరు నిలిచి ఈ సరస్సు ఏర్పడింది. భూకంపం రావడానికి ముందుఅడవిలో ఉన్న చెట్లు ఇప్పటికీ ఈ సరస్సులో నిలిచి ఉండి ప్రత్యేకఅందాన్ని తెచ్చి పెట్టాయి. భూ కంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలుఇక్కడ ఉంటాయని, అందుకే చెట్లు యింకా నిలబడి ఉన్నాయని, స్థానిక ముంపాతెగ ప్రజలు ఈ సరస్సును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఏర్పడి డెబ్బై యారు యేళ్ళు అయింది. షారుఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన ‘ కోయిల్ ‘ అనే సినిమాను 1997లో ఇక్కడ చిత్రీకరించారు. అప్పటినుంచి పర్యాటకంగాప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత అసలు పేరు మాయమై ” మాధురీ లేక్ ” గాపేరుపొందింది. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఉన్న సరస్సుస్థానికంగా పేరు కోల్పోయి ఒక సినీనటి పేరుతో స్థిరపడడం బాధగాఅనిపించింది. మాధురీ దీక్షిత్ కూడా అందమైన నటి కదా! అని నాకునేను నచ్చ చెప్పుకున్నాను. ఇక్కడ ఒక గంట సమయం గడిపి, పక్కనే ఉన్నకెఫ్పిటేరియాలో వేడి వేడి టీ తాగి సుమారు ఒక కిలో మీటర్ దూరంలో పార్క్ చేసిన వాహనం దగ్గరకు వెళ్ళాను.
అక్కడినుంచి మా ప్రయాణం దాదాపు పది కిలోమీటర్లదూరంలో ఉన్న ఇండో – చైనా బార్డర్ బూమ్లా పాస్ కు. మధ్యలో తీస్రాగురుద్వార్ దగ్గర ఆగాం. దీనిని ఆర్మీ నిర్వహిస్తోంది . పైకి గురుద్వారాలోకివెళ్ళడానికి రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి. కిందనే లంగరుపెడుతున్నారు. టీ, పాయసం రెండూ ఉన్నాయి. మేం పాయసం తీసు కున్నాం. అక్కడినుంచి బూమ్లా పాస్ కు చేరుకున్నాం. రెండు మూడుచోట్లమేం తీసుకున్న ప్రత్యేక అనుమతి పత్రాన్ని పరిశీలించారు. పార్కింగ్లోవాహనాన్ని పెట్టి ఒక కెఫ్టేరియాలో నుంచి వెళ్ళి బయటకురావాలి.అప్పుడు ఎంతమంది బార్డర్ ప్రదేశంలోకి వెళ్ళేది తనిఖీ చేస్తారు.ఒక్కసారికి సుమారు ఇరవై, ముప్పైమందిని మాత్రమే లోపలికిఅనుమతిస్తారట. ఒక ఆర్మీ అధికారి చరిత్రతోపాటు రూల్స్ వివరించాడు.మనదేశంలో మాత్రమే ఈ ప్రదేశం చూడడానికి అనుమతిస్తారు.చైనాప్రజలకు ఈ అవకాశం లేదు. గట్టిగా మాట్లాడకూడదు. ఫోన్లకు,కెమెరాలకు అనుమతి లేదు. గేట్ దాటి చైనా దేశంలోకి వెళ్ళకూడదులాంటివి చెప్పాడు. చెప్పేక్రమంలో ఆయన హాస్య చతురతకు అబ్బుర పడ్డాను. కుటుంబానికి దూరంగా, దేశ రక్షణ బాధ్యతలో నిరంతరం ఒత్తిడితో గడిపే ఆర్మీకి ఇలాంటి హాస్య నైపుణ్యం ఉండడం చాలాఅవసరం అనిపించింది.
అక్కడినుంచి బార్డర్ సుమారు రెండు, మూడు కిలోమీటర్లదూరం ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడిదాకా వెళ్ళాను. అక్కడమరొక ఆఫీసరు 1962 చైనా భారత్ యుద్ధ విశేషాలు చెప్పాడు. ఆసందర్భంలో జోగిందర్ సింగ్ చూపిన సాహసాన్ని చెప్పాడు. ఆ పాయింట్నుంచి కనిపించే శివలింగాకారపు ఎత్తైన పర్వతానికి ఎడమవైపు భారత దేశం, కుడివైపు చైనా సరిహద్దు అని చెప్పాడు. యుద్ధం ఆగిన తరువాత ఈ పర్వతం పైననే లాక్ ఒప్పందం జరిగిందని, గేట్ లోపల కనిపించినఎర్ర రంగు నేలనుంచి చైనా సరిహద్దు మొదలవుతుందని చెప్పాడు.అక్కడి నుంచి సుమారు పదిహేను కిలోమీటర్లు లోపలికి వెళితే”త్సోనాడోజాంగ్ ” అనే ఊరు వస్తుందని, అది ఒకప్పుడు టిబెట్ దేశంలోనిది కానీ ప్రస్తుతం చైనా దేశానికి చెందిన గ్రామమని, అక్కడ కూడాముంపా తెగ ప్రజలే నివసిస్తున్నారనీ చెప్పాడు.
బూమ్లా పాస్ సముద్రమట్టం నుంచి పదిహేనువేలరెండువందల అడుగుల ఎత్తులో దాదాపు నాలుగువేల ఆరువందలముప్ఫై మూడు మీటర్ల ఎత్తులో ఇండియా – చైనా లాక్ ( లైన్ ఆఫ్యాక్చువల్ కంట్రోల్ ) మీద ఉన్నది. భారత దేశంలోని చివరి గ్రామం. 1962 భారత్ – చైనా యుద్ధం తర్వాత ఈ రెండు దేశాలు ఒప్పందంచేసుకున్న ప్రదేశం. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఐదు బీ.పీ.ఓ ( బార్డర్పర్సనల్ మీటింగ్ పాయింట్స్ ) లలో ఇది ఒకటి. అంటే ఇదిఅంతర్జాతీయ బార్డర్ కాదు. చాలా సెన్సిటివ్ ప్రాంతం. 1996 నుండివాస్తవ నియంత్రణ రేఖ దగ్గర తుపాకులు కాల్చికూడదనే ఒప్పందం కూడా జరిగింది. అందుకే ఎక్కడా కనిపించనంత ఆర్మీ స్థావరాలు ఈమార్గంలో కనిపిoచాయి. ఇక్కడ ప్రతి యేడు ఇరు దేశాల సైనికులు శాంతి,స్నేహాలకు కొనసాగింపుగా మిఠాయిలు ఇచ్చి పుచ్చుకుంటారట. ఇక్కడ గేట్వద్ద ఆర్మీవాళ్ళే ఫోటో తీసి, చక్కని ఫ్రేమ్ కట్టి ఇస్తారు. అందుకుఐదువందల రూపాయలు చెల్లించాలి.
1959లో పధ్నాలుగవ దలైలామా టిబెట్ నుంచిపారిపోయి ఈ మార్గంలోనే భారతదేశంలోనికి వచ్చాడు. అందుకే ఈ
ప్రాంతం బౌద్ధులకు పవిత్రమైంది.
ఇంకావుంది