గిరియానం – 24 అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా ఇండో బార్డర్ కు వెళ్ళడానికిఅప్పటిదాకా మేం ప్రయాణించిన వాహనానికి అనుమతి లేనందువల్లరాహుల్ మరో వాహనాన్ని తీసుకు వచ్చాడు. వాహనానికి విడిగా ఐదువేలరూపాయలు చెల్లించాలి. దానితోపాటు ప్రత్యేక అనుమతి కూడా తీసు కోవాలి. ఆ ప్రదేశం పదిహేనువేల రెండు వందల అడుగుల ఎత్తులోఉండడం, ఇరుకైన పర్వతశ్రేణుల్లో ప్రయాణించాలి కనుక ప్రత్యేకరిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారట. ఈ జీప్ డ్రైవర్ కొడుకుకుఆరోగ్యం బాగాలేనందువల్ల తాను కొంతదూరం వచ్చి మా డ్రైవర్ రాహల్ కేజీప్ అప్పగించి వెళ్ళిపోయాడు. ఉదయం ఏడుగంటలకు మా ప్రయాణం మొదలైంది.ఎటుచూసినా ఎత్తైన పర్వతాలు, భిన్న వర్ణం పువ్వులు, దారి పొడుగునా మిలిటరీ ఆనవాళ్ళు, సరస్సులు, జలపాతాలతో దారి అంతా చూపుతిప్పనివ్వ లేదు. పర్పుల్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ సమయంలో ఇక్కడమాత్రమే వికసిస్తాయట. చిన్న చిన్న తెల్లని పువ్వులు ఆకాశం నుంచితారలు రాలి పడినట్లుగా అంతటా విస్తారంగా వికసించి ఉన్నాయి. ఉదయం పదిగంటలకు ” షెంగ్స్టర్ త్సో “లేక్ కు చేరుకున్నాం. ‘ త్సో ‘ అంటే టిబెటన్ భాషలో ‘ సరస్సు ‘ అని అర్థం. తవాంగ్గ్రామం నుంచి సుమారు ముప్ఫై కిలోమీటర్ల దూరం. మాకు దాదాపుమూడు గంటల సమయం పెట్టింది. పన్నెండువేల నాలుగువందల అరవైయేడు అడుగుల ఎత్తులో పర్వతాల నడుమ ఉన్న అందమైన సరస్సుఇది. 1950 ఆగస్టు 15 తేదీన 8.6 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చిందట. అపుడు కొండలు విరిగిపడి లోయలోని ఒక వాగుకు అడ్డo పడ్డాయి. అలానీరు నిలిచి ఈ సరస్సు ఏర్పడింది. భూకంపం రావడానికి ముందుఅడవిలో ఉన్న చెట్లు ఇప్పటికీ ఈ సరస్సులో నిలిచి ఉండి ప్రత్యేకఅందాన్ని తెచ్చి పెట్టాయి. భూ కంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలుఇక్కడ ఉంటాయని, అందుకే చెట్లు యింకా నిలబడి ఉన్నాయని, స్థానిక ముంపాతెగ ప్రజలు ఈ సరస్సును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఏర్పడి డెబ్బై యారు యేళ్ళు అయింది. షారుఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన ‘ కోయిల్ ‘ అనే సినిమాను 1997లో ఇక్కడ చిత్రీకరించారు. అప్పటినుంచి పర్యాటకంగాప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత అసలు పేరు మాయమై ” మాధురీ లేక్ ” గాపేరుపొందింది. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఉన్న సరస్సుస్థానికంగా పేరు కోల్పోయి ఒక సినీనటి పేరుతో స్థిరపడడం బాధగాఅనిపించింది. మాధురీ దీక్షిత్ కూడా అందమైన నటి కదా! అని నాకునేను నచ్చ చెప్పుకున్నాను. ఇక్కడ ఒక గంట సమయం గడిపి, పక్కనే ఉన్నకెఫ్పిటేరియాలో వేడి వేడి టీ తాగి సుమారు ఒక కిలో మీటర్ దూరంలో పార్క్ చేసిన వాహనం దగ్గరకు వెళ్ళాను. అక్కడినుంచి మా ప్రయాణం దాదాపు పది కిలోమీటర్లదూరంలో ఉన్న ఇండో – చైనా బార్డర్ బూమ్లా పాస్ కు. మధ్యలో తీస్రాగురుద్వార్ దగ్గర ఆగాం. దీనిని ఆర్మీ నిర్వహిస్తోంది . పైకి గురుద్వారాలోకివెళ్ళడానికి రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి. కిందనే లంగరుపెడుతున్నారు. టీ, పాయసం రెండూ ఉన్నాయి. మేం పాయసం తీసు కున్నాం. అక్కడినుంచి బూమ్లా పాస్ కు చేరుకున్నాం. రెండు మూడుచోట్లమేం తీసుకున్న ప్రత్యేక అనుమతి పత్రాన్ని పరిశీలించారు. పార్కింగ్లోవాహనాన్ని పెట్టి ఒక కెఫ్టేరియాలో నుంచి వెళ్ళి బయటకురావాలి.అప్పుడు ఎంతమంది బార్డర్ ప్రదేశంలోకి వెళ్ళేది తనిఖీ చేస్తారు.ఒక్కసారికి సుమారు ఇరవై, ముప్పైమందిని…