“అక్షర జ్ఞానం లేని ఇర్ఫాన్ గూగుల్ తల్లిని ప్రార్థించి అనేక విషయాలు నేర్చుకున్నాడు. భగత్ సింగ్, అంబేద్కర్ సిద్ధాంతాల్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని అవగతం చేసుకున్నాడు.మొబైల్ ఫోన్లోటైప్ చేయడం కూడా రాని ఇర్ఫాన్ తన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్వాయిస్ సెర్చ్, యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ రాజకీయాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మిక చట్టాలు, భగత్ సింగ్ రచనలు, దుశ్యంత్ కుమార్, ఆడం గోండ్వీ కవిత్వం వంటి విషయాలునేర్చుకున్నాడు..”

(అడ్వకేట్)
జంతర్ మంతర్ సంచలనం మహమ్మద్ ఇర్ఫాన్ ఇటీవల జంతర్ మంతర్ నిరసనలో వినిపించిన ఒక స్వరం వైరల్గా మారి దేశ ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. దిల్లీ లో మురికివాడగా పేరొందిన సావ్దా జేజే కాలనీలో నివసిస్తున్న మహమ్మద్ఇర్ఫాన్(35), చేతి బండిపై మంచు (ఐస్) అమ్ముతూ జీవించే అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన ఒక సాధారణ వ్యక్తి. ఎలాంటి అక్షర జ్ఞానం లేనివాడు. కనీసం మొబైల్ లో అక్షరాల్నిగుర్తుపట్టి టైప్ చేయలేడు. కానీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పన్నులు, కార్మిక హక్కులు, సమాజం—ఇలాంటి క్లిష్టమైన అంశాల పై అతని మాటలు దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. ఆయన మాటలకు ఫిదా అయినా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్వయంగా ఇర్ఫాన్ నివాసానికి వెళ్లి అతనితో సంభాషించాడు. ఇటీవల జంతర్ మంతర్ లో ‘ద లల్లన్‌టాప్’ జర్నలిస్ట్ రజత్పాండే తో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్కావడంతో మహమ్మద్ ఇర్ఫాన్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ పీఠికను ఆయన ఆత్మవిశ్వాసంతో వల్లించడం, ప్రజాస్వామ్య విలువలపైచేసిన వ్యాఖ్యలు, పేదల జీవితాలపై వ్యక్తం చేసిన ఆవేదన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకోబడ్డాయి.
చదువు లేకున్నా జ్ఞాన దాహం
అక్షర జ్ఞానం లేని ఇర్ఫాన్ గూగుల్ తల్లిని ప్రార్థించి అనేక విషయాలు నేర్చుకున్నాడు. భగత్ సింగ్, అంబేద్కర్ సిద్ధాంతాల్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని అవగతం చేసుకున్నాడు.మొబైల్ ఫోన్లోటైప్ చేయడం కూడా రాని ఇర్ఫాన్ తన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్వాయిస్ సెర్చ్, యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ రాజకీయాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మిక చట్టాలు, భగత్ సింగ్ రచనలు, దుశ్యంత్ కుమార్, ఆడం గోండ్వీ కవిత్వం వంటి విషయాలునేర్చుకున్నాడు. ఏ సమాచారం విన్నా వెంటనే దాన్ని మళ్లీ గూగుల్‌ను అడిగి ధృవీకరించేవాడు.అనంతరం వాస్తవాలు ఆధారంగా తనఅభిప్రాయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. సమాచార యుగంలో‘డిజిటల్ లిటరసీ’ ఎంత శక్తివంతమో ఇర్ఫాన్ నిరూపించాడు.
విషయ పరిజ్ఞానం – నిజాయితీ తో కూడిన వాగ్దాటి
మహమ్మద్ ఇర్ఫాన్ దేశ సమస్యల్ని ప్రస్తావిస్తూ పార్లమెంటుసభ్యులకు సవాలు విసురుతున్నాడు. అతను ఎన్ సి ఆర్ బిడేటాను ఉటంకిస్తూ, దేశంలో జరిగిన 1.7 లక్షలకు పైగాఆత్మహత్యలలో గణనీయమైన భాగం దినసరి కూలీలేనని, వారు ఆర్ధిక ఇబ్బందుల వల్లే ప్రాణాలు తీసుకున్నారని ఎత్తిచూపాడు. అలాగే 2019-21 మధ్య 13 లక్షల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారనే గణాంకాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలని డిమాండ్ చేశాడు. కూలీల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్న వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు.. దేశంలో కనీస వేతనం చట్టం అమలును ప్రశ్నించాడు. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, పేదలకువైద్యం అందడంలో ఆయుష్మాన్ భారత్ పథకంలోని సమస్యలను వివరించాడు . అట్టడుగు వర్గాలు దేనితోనైనా రాజీపడగలవని, కానీ విద్యతోమాత్రం రాజీపడలేవని అతను బలంగా వాదించాడు. ప్రైవేట్మెడికల్ డిగ్రీలకు కోట్లాది రూపాయలు భరించలేనందున, పేదలకు ప్రభుత్వ పరీక్షలు మరియు కళాశాలలు మాత్రమే ఏకైకమార్గమని అతను స్పష్టం చేశాడు. మురికివాడల్లోని కుటుంబాలను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగం , నార్కోటిక్స్ వ్యాపారాన్ని అనుమతిస్తున్న అవినీతి పోలీసువ్యవస్థపై కూడా అతను గట్టిగా నిలదీశాడు. తాను ఏ రాజకీయపార్టీకి చెందినవాడిని కాదని ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలోప్రతి పౌరుడికీ ఉందని అభిప్రాయపడ్డారు.
గోది మీడియా గుర్తించని సామాన్యుడు
వర్తమాన రాజకీయాలు, భారత రాజ్యాంగం – విలువలు, దేశంముందున్న సవాళ్లు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు.. మొదలైన అంశాలపై ఆయన అనర్గళంగా అలవోకగా అత్యంత అమాయకత్వంతో కూడిన నిజాయితీతో మాట్లాడితే నేడు దేశం వీక్షిస్తున్నది. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయిసైతం ఆయన అవగాహనకు విస్తుపోయారు. ఇంతటి పరిజ్ఞానం, అవగాహన రోజూ టీవీ స్టూడియోలో కూర్చొనిచర్చల్లో పాల్గొంటున్న మేధావులు, రాజకీయ విశ్లేషకుల్లో సైతంలేదనిపిస్తోంది. ‘గోది’ మీడియా టీవీ స్టూడియోలలో కూర్చొనిఅరుపులు కేకలతో ‘షో’ లను రక్తి కట్టిస్తున్న యాంకర్లు ఈసామాన్యుడిని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వీక్షకులను వెర్రివెధవలుగా మారుస్తున్న డిబేట్లకు కాలం చెల్లింది. ఇర్ఫాన్ కథ చెబుతున్న పాఠం ఒక సాధారణ కూలీ స్వరం జాతీయ వేదికపై వినిపించ గలదని మహమ్మద్ ఇర్ఫాన్ నిరూపించారు. ప్రజాస్వామ్యం పౌరుల అవగాహనతోనే బలపడుతుంది.సాధారణ మనిషి అనుభవం, పెద్ద పెద్ద సిద్ధాంతాల కంటే ఎక్కువ నిజాయితీగాఉంటుంది.డిజిటల్ యుగంలో జ్ఞానం అందరికీ అందుబాటులోఉంది, కానీ అవకాశాలు మాత్రం అందరికీ సమానంగా లేవు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు, ప్రజల బాధలనువినడం, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం అని ఇర్ఫాన్ మనకు గుర్తు చేస్తున్నాడు:
ఇర్ఫాన్ మాటల్లో నటన లేదు, సిద్ధాంతాల ప్రదర్శన లేదు. తనజీవితంలో చూసిన అనుభవాలే మాటలుగా మారి లక్షలాదిమందిని కదిలించాయి. పేదరికం కారణంగా సోదరి పెళ్లి ఆగిపోయినందున చాలా మంది ఆర్ధిక సహాయం అందించడానికి ముందుకు వచ్చినప్పటికీ ఇర్ఫాన్ ఎలాంటి విరాళాలు, ఆర్థిక సహాయం తీసుకోడానికి గట్టిగా నిరాకరించినాడు. బదులుగా, ప్రజలంతా ఏకమై పేదల గొంతుకగామారాలని అతను కోరాడు. ఒక ఐస్ అమ్మేవాడిగానే తనజీవితాన్ని కొనసాగిస్తూ, అట్టడుగు వర్గాల హక్కుల కోసంపోరాడతానని ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. దిల్లీ గల్లీ నుండి వినిపించిన ప్రజాస్వామ్య స్వరం ఇర్ఫాన్ ని చూస్తేశ్రీ శ్రీ మాటలు గుర్తొస్తాయి. పేర్లకి, పుకార్లకి నిబద్దులు గాని ఇలాంటి యువకులు గతకాలపు మితవాదపు గారడీలు నమ్మరు. అయితే నేడు కోట్లాదిమంది జేబుల్లో , చేతిలో ఇమిడిపోయే డిజిటల్ తెరలపై విద్వేషం విషం చిమ్ముతోంది. రెచ్చగొట్టేప్రసంగాలు, తోటి పౌరుడిపై శత్రుత్వం,అబద్ధ సమాచారం నిత్యంమీడియాలో జాలు వారుతోంది. దేశ నాయకుడే బహిరంగంగా”వాళ్లు”, “మనం” అని ప్రజల్ని విడదీస్తుంటే మహమ్మద్ ఇర్ఫాన్ మాటల్ని ప్రజలు ఆలకిస్తారా? పేరు నచ్చని మూకలు ట్రోలింగ్సైన్యంతో దాడి చేస్తుందా? దేశంలో రాజ్యాంగ విలువల అమలు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్షరాస్యత లేకపోయినా రాజ్యాంగం స్ఫూర్తిని అందించిన ఇర్ఫాన్, మన దేశానికి ఒక అద్దం పట్టాడు. ఆ అద్దంలోకనిపిస్తున్న ప్రతిబింబాన్ని మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. మార్చడానికి ఉద్యమించాలి.





