– ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ప్రాణాపాయం
కరీంనగర్,ప్రజాతంత్ర,జూన్6: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కరీంనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ భవన్ రెండో అంతస్తు నుంచి దిగుతుండగా సాంకేతిక కారణాల వల్ల లిప్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ప్లోర్‌కు పడిపోయింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు లిప్ట్‌లో మరో ఆరుగురు ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే కవ్వంపల్లి లిప్ట్ ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



