ప‌టేల్‌ కృషితోనే తెలంగాణకు విమోచనం

  • విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం
  • పరేడ్‌ ‌గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ ‌మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్లు స్తూపం, సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌విగ్రహం వద్ద కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌ ‌రెడ్డి మాట్లాడారు. నిజాంపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేశారని కొనియాడారు. ప్రజల బలిదానాలు, త్యాగాల తరువాత తెలంగాణకు స్వాతంత్య్రం వొచ్చిందన్నారు.

రజాకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్‌ ‌పటేల్‌ది సాహసోపేత పాత్ర అని కిషన్‌ ‌రెడ్డి గుర్తు చేశారు. భర్కత్‌పురలోని  బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. కాగా  విమోచనోత్సవాలతో సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్స్ ‌పరిసరాలు శోభాయమానంగా మారాయి. పోలీసుల కవాతులు, వీవీఐపీల రాక, కళాకారుల నృత్యాలతో విమోచన వేడుకలు నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా సాగాయి. వేడుకల్లో కళాకారులు నృత్యాలతో అలరించారు. మూడు రాష్ట్రా కళారూపకాల ప్రదర్శనతో పరేడ్‌ ‌గ్రౌండ్స్ ‌పరిసరాలు మార్మోగాయి. డప్పుదరువులు, ఒగ్గు కథలతో కళాకారులు హోరెత్తించారు.

దిల్లీ పెద్దల మెప్పుకోసమే రాజీవ్‌ ‌విగ్రహావిష్కరణ
రైతుబంధు వెంటనే ఇచ్చి నిజాయితీ చూపండి
తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌దిల్లీ పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట రాజీవ్‌ ‌గాంధీ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించార‌ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ అన్నారు.  మంగళవారం తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. గతంలో సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌ ‌గాంధీని ముద్ద పప్పు అని తిట్టారని.. ఇప్పుడు వాటిని కవర్‌ ‌చేసుకోవడానికి రాజీవ్‌ ‌గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్‌ ‌గాంధీ కంప్యూటర్‌ ‌కనిపెట్టాడని రేవంత్‌ ‌రెడ్డి చెప్తున్నారని… కంప్యూటర్‌ ‌కనిపెట్టిన ఛార్లెస్‌ ‌బాబేజ్‌ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందంటూ ఎద్దేవా చేశారు. చేతనైతే రైతుబంధు ఇవ్వాల‌ని, వానాకాలానికి 14 రోజులే మిగిలింద‌ని, . చేతనైతే కరెంటు సరిగా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. పోలీస్‌ ‌బండ్లల్లో డీజిల్‌ ‌పోయడానికి నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు.

రామగుండంలో రూ.2 కోట్లు డీజిల్‌ ‌బిల్లులు పెండింగ్‌ ఉన్నాయన్నారు. రూ.4000 పెన్షన్‌, మహిళలకు రూ. 2500 సాయం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వంటి హామీలు ఏమ‌య్యాయ‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు గురుకులాల్లో విద్యార్థులు విష ఆహారం తిని అవస్థలు పడుతున్నారని, విద్యార్థినులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. 2500 మంది గురుకుల టీచర్లను పక్కన పెట్టారన్నారు. క‌నీసం హోంగార్డులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్ర‌జ‌లంద‌రూ జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే ఏవీ పట్టించుకోకుండా కేవలం కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ ‌నాయకులను తిట్టడమే రేవంత్‌ ‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని కేటీఆర్‌ ‌తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు సచివాలయం ఎదుట రాజీవ్‌ ‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్‌ ‌పిలునిచ్చిన విషయం తెలిసిందే. ముందుగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు కేటీఆర్‌. ‌తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌గంగుల కమలాకర్‌ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17:  ‌తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ ‌పార్థసారథి పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో రాణి కుముదిని నియమిస్తూ  గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్లపాటు ఆమె ఎస్‌ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

1988 బ్యాచ్‌కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఆమెని తిరిగి అదే హోదాలో కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్‌ఈసీ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *