వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి!

కుల వృత్తులను, గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంపొదిస్తే తప్ప గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయలేం. వ్యవసాయాధారిత పరిశ్రమ లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంది.  గ్రామాలకు ముఖ్యంగా సర్పంచ్‌లకు విధులు, నిధులు ఇస్తేనే ఇది సాధ్యమని గుర్తించాలి.  గ్రామాలను యూనిట్‌గా చేసి కార్యక్రమాలను రూపొందించుకునే వెసలుబాటు సర్పంచ్‌లకు ఉండాలి. పల్లెలో చేపడుతున్న ఏ కార్యక్రమం అయినా, అంతా అధికారుల పర్యవేక్షణలోనే సాగుతోంది. గ్రామాల్లో సర్పంచ్‌ల బాధ్యత నామమాత్రంగా ఉంటోంది. వారికి బాధ్యత అప్పగిస్తే  పన్నుల వసూళ్లు మొదలు కార్యక్రమాల అమలు వరకు వారికి స్వేఛ్చతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. పనులు చేయని సర్పంచ్‌లను చట్టబద్దంగా శిక్షించేలా చట్టం రూపొందించిన ప్రభుత్వం నిధుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది. గ్రామాల్లో పన్నులు ఇతరత్రా రూపంలో వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే తప్ప నిధులు సమకూరవు. అలాగే కేంద్రం అమలు చేస్తున్న  ఉపాధి హావిరీలో పారిశుద్ధ్య పనులు చేర్చడంతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక భారం తప్పుతుంది. పంచాయితీల ఆధ్వర్యంలో జరిగేలా, దాని పరిధిలోనే అధికారులు పనిచేసేలా చూడాలి. అప్పుడే గ్రామాలు ఆర్థికంగా బలపడడంతో పాటు కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయి.

ఇకపోతే పారిశుద్ధ్య పనుల్లో ఉపాధి కూలీల ఏర్పాటుతో పంచాయతీలకు ఆర్థికభారం తగ్గుతుంది.  పంచాయతీలకు వచ్చే నిధులు, ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించు కోవొచ్చని నిపుణులు అంటున్నారు. ఉపాధిహావిరీ పథకాన్ని సద్వినియోగం చేసుకుకోవాలన్న సర్కార్‌ నిర్ణయంతో గ్రామాల్లో పారిశుద్యం వెల్లివిరియనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేస్తున్న పనుల్లో గ్రావిరీణ పారిశుధ్యాన్ని  జోడిరచడం  ద్వారా గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకాలి. ఉపాధి హామీ పనుల్ని విస్తృతం చేయాలని, అందులో భాగంగా పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను ఉపాధి కూలీలతో నిర్వహించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల్లో మార్పు రానుంది.  వాస్తవానికి పంచాయతీలకు లభించే సాధారణ నిధుల నుంచి 30 శాతం వరకు పారిశుద్ద్యానికి ఖర్చు చేయాలనే నిబంధన గతంలో ఉండేది. తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. అంటే పంచాయతీకి వస్తున్న ఆదాయంలో సగం పారిశుద్ద్యానికే వెచ్చిస్తున్నారు.

 

ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడంలేదు. అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో పంచాయతీలు బలోపేతం కావడంతోపాటు వాటికి ఆర్థికభారం కూడా తప్పుతుంది.  కొత్తగా ఉపాధి కూలీలను పారిశుద్ధ్య పనుల్లోకి తీసుకుంటే గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త నిల్వలను తరలించే వీలుంటుంది. ఈక్రమంలో అధికారులు పారిశుద్ధ్య పనుల్లో ఉపాధి కూలీలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.ఈ నిర్ణయంతో అటు కూలీలకు పని దొరకడంతో పాటు పల్లెలు పరిశుభ్రంగా మారే అవకాశం ఉంది. గ్రామాల పరిధిలో కూలీలకు ఏం పని చూపించాలని భావిస్తున్న ఉపాధి సిబ్బందికి అధికారుల నిర్ణయం ఊరటనిస్తోంది. అంతేకాకుండా చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత, భూములు చదును చేయడం, నీటి తొట్లు, పొలాల్లో కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనుల ద్వారా ఉపాధి కూలీలకు వంద రోజుల పనులు కల్పించవొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

 

ఉపాధి హావిరీ పథకంలో పారిశుద్ధ్య పనులు చేయించాలనే ఆలోచన మంచి నిర్ణయమని ఇప్పటికే సర్పంచులు సైతం అంగీకరించారు.  దీనివల్ల ప్లలెలు పరిశుభ్రంగా మారతాయి. పంచాయతీలకు ఆర్థిక భారం తప్పుతుంది.  గ్రామ పంచాయతీల్లో ఇదివరకే డంపిం గ్‌ యార్డుల నిర్మాణ పనులను ఉపాధి కూలీలతో చేపడుతున్నారు.   పంచాయతీ పారిశుద్ధ్య పనులనూ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడంతో కూలీలకు వంద రోజులు సమృద్ధిగా పనులు కల్పించవచ్చని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు. ఇంతకాలం వంద రోజుల పనులు చేపట్టని కూలీలకు ఏవిధంగా పని చూపించాలనే ఆలోచిస్తున్న ఉపాధి సిబ్బందికి అధికారుల నిర్ణయం వూరటనిస్తోంది. కూలీలకు ప్లలెల్లోనే పారిశుద్ధ్య పనులు చూపించవచ్చు. అలాగే చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత, భూములు చదును చేయడం, నీటి తొట్లు, పొలాల్లో కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనులతో ఉపాధి కూలీలకు వంద రోజుల పనులు కల్పించవొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

-వడ్డె మారెన్న
9000345368

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *