– కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారన్న ప్రచారంపై
– బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌చార్జి భరత్ కుమార్ నోటీసుల జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. పార్టీ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌చార్జి సోమ భరత్ కుమార్ ఈ నోటీసులు పంపారు. ఇదే అంశంపై ఇప్పటికే ఓ దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేయగా అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు పంపారు. సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని లీగల్ సెల్ డిమాండ్ చేసింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





