రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని వివరించారు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న సదరు ఉపరితల ఆవర్తనం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. శనివారం ఉదయం 5 గంటలకు సమయానికి బలహీన పడిందని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *