షేర్ మార్కెట్ లో నష్టాలు.. సాఫ్ట్‌వేర్ ఆత్మహత్య

– హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం
– మూడు నెలల క్రితమే వివాహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో మనోవేదనతో హైదరాబాదుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే వివాహమైన ఆ యువకుడు జీవితంపై విరక్తితో భవనంపై నుంచి దూకాడు. ఈ హృదయ విదారక ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తమ్మిశెట్టి ప్రవీణ్(34) వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతనికి మూడు నెలల క్రితమే వివాహమైంది. కొంతకాలంగా ప్రవీణ్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. అయితే, ఇటీవల మార్కెట్‌లో నష్టాల కారణంగా అతను పెట్టిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. భారీ నష్టాల విషయం కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిస్తే పరువు పోతుందని తీవ్రంగా మదనపడ్డాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చైతన్యపురిలోని ఓ భవనంపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబీకుల‌కు స‌మాచారం అంద‌జేశారు. ఈ ఘటనతో ప్రవీణ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *