వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ దేవస్థా నంలో దేవీశరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివా రం నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని సరస్వతీమాత గా అలంకరించి పూజలు చేశారు. సర స్వతీ మాతగా అలంకరిం పబడిన అమ్మ వారి దర్శనం వల్ల సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ప్రధానార్చ కులు భద్రకాళి శేషు తెలిపారు. శనివారం కార్యక్రమాలకు ఉభయదాతలుగా హైదరాబాద్ శారదా విద్యా సంస్థల అధినేతలు సందిపూడి రవిశంకర్ మానస, నాగభూషణం శ్రీదేవి, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు సునీత, డాక్టర్ సనత్ కుమార్ డాక్టర్ సాహితి కుమారి, డాక్టర్ బి.వైష్ణవి, జోశ్యుల కామేశ్వరశర్మ- కిరణ్మయి దంపతులు వ్యవహరించారు. అమ్మ వారిని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు వారి బంధుమిత్రలు దేవాలయంలో కొత్తగా రూ.కోటితో తయారు చేయించిన 27 అడుగుల ఎత్తుగల రథాన్ని మంత్రి సమక్షంలో దేవాలయానికి అందించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం. ధర్మ కర్తలు కమటం వేణుగోపాల్, కల్లూరి పవన్ కుమార్, కటకం రాములు, కారెంగుల సురేష్బాబు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, చిదర అంజనీదేవి, మాడి శెట్టి సతీష్, పేరాల శ్రీనివాస రావు, రమేష్చంద్ భంగ్, మోతుకూరి మయూరి రామేశ్వర్రావులు, మాజీ ధర్మక ర్తలు జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్, గాండ్ల స్రవంతి, పాలడుగుల అంజనేయులు తదితరులున్నారు. అనంతరం మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాన్యం వినయభాస్కర్, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవ రెడ్డి తదితరులు దర్శించుకున్నారని ఈఓ రామల సునీత తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





