యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

– అక్టోబర్ 11న దుబాయ్ అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో వేడుకలు
– కార్మికుల సమస్యలపై ఈటీసీఏ ప్రతినిధులతో కేటీఆర్ చర్చ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ-యూఏఈ) ప్రతినిధులు ఆహ్వానించారు. ఈమేరకు కేటీఆర్ నివాసంలో శుక్రవారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.  బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈటీసీఏ ఆధ్వర్యంలో పదహారేళ్లుగా యూఏఈలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ సంస్కృతీసాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఏటా బతుకమ్మతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈసారి అక్టోబర్ 11న దుబాయ్‌లోని అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

గల్ఫ్ కార్మికుల పరిస్థితులపై ఆరా

ఈ సందర్భంగా గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికుల పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై కేటీఆర్ ఆరా తీశారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈటీసీఏ ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ప్రవాస తెలంగాణ సంఘాల కృషి అభినందనీయమన్నారు. ఈటీసీఏ కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా గల్ఫ్ కార్మికుల కష్టనష్టాల్లోనూ అండగా నిలుస్తూ ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు సహాయసహకారాలు అందిస్తున్న తీరు గొప్పదని కేటీఆర్ అన్నారు. గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన పలువురు తెలంగాణవాసుల సమస్యల పరిష్కారానికి కేటీఆర్ వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ చూపి వారిని స్వస్థలాలకు చేరుకునేలా చేసిన విషయాన్ని ఈటీసీఏ ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేటీఆర్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *