-అస్తిత్వ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కలాన్ని, గళాన్ని వినిపించిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు అందించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ స్ఫూర్తి కొనసాగిద్దాం అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. దాశరథి జయంతి సందర్భంగా కే చంద్రశేఖర్ రావు ఘన నివాళులు అర్పించారు. వారి కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జైలు గోడల నడుమ బందీ అయికూడా..’నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ గర్జించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సమర యోధుడు దాశరథి అని కేసీఆర్ కొనియాడారు. కృష్ణమాచార్యుల త్యాగాలను, తెలంగాణ అస్తిత్వం కోసం వారు చేసిన సాహితీ పోరాట కృషిని గుర్తించి, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ, వారి పేరున సాహితీ పురస్కారాన్ని నెలకొల్పిందనీ తెలిపారు. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌ రవం, అస్తిత్వ పరిరక్షణ కోసం రాజులనే ఎదిరించిన కలం వీరుడు దాశరథి కృష్ణమాచార్యులు అందించిన స్ఫూర్తి తెలంగాణ సమాజానికి నేటి అవసరం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




