మాజీ ఎమ్మెల్యే పెద్దికి కెసిఆర్‌ ‌పరామర్శ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి చేరుకున్నారు. కేసీఆర్‌ ‌యశోద హాస్పిటల్‌ ‌వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. పెద్ది కుటుంబసభ్యులకు కేసీఆర్‌ ‌మనోధైర్యాన్ని అందించారు. కేసీఆర్‌ ‌వెంట బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌హరీష్‌ ‌రావు, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, ‌మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, ‌మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌, ‌మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్దికి ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం 7 గంటలకు తీవ్రమైన గుండెపోటు రాగా ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ ‌మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. అత్యవసర సీపీఆర్‌ అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని గ్రీన్‌ ‌ఛానల్‌ ‌ద్వారా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించారని తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *