“నీ కోరిక తీరిందా రాహుల్?”…

  • క‌మిష‌న‌రేట్‌లో మ‌నుసు క‌దిలించే దృశ్యం!
  • ‘పోలీస్’ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి
  • ఒక్కరోజు పోలీస్ అధికారిగా అవ‌కాశం
  • దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాలని పిలుపు

మేడ్చల్/ దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27 : పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల కోరికను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి (CP Badugula Sumathi) నెరవేర్చారు. సమాజంలో పోలీసులంటే ఉండే కరకుతనాన్ని కాకుండా, వారిలోని కరుణను చాటిచెప్పే అద్భుత ఘట్టానికి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వేదికైంది. ఒకరోజైనా పోలీస్ అధికారిగా కుర్చీలో కూర్చోవాలని కలలు కన్న రాహుల్ ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి సీపీ సుమతి ఆహ్వానించి తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ ధరింపజేశారు. “నీ కోరిక తీరిందా రాహుల్?” అంటూ ఆప్యాయంగా పలకరించగా, ఆనందంతో చిరునవ్వులు చిందించిన రాహుల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వలస వచ్చిన తిరుమలరావు–రాధమ్మ దంపతుల కుమారుడు రాహుల్ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. రెండు కాళ్లు ఉన్నప్పటికీ నడవలేని పరిస్థితి, మాటలు కూడా సరిగా మాట్లాడలేని స్థితిలో ఉండటంతో కుటుంబానికి భారంగా మారాడు.ఈ విషయాన్ని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ రష్మిత దృష్టికి తీసుకెళ్లగా, రాహుల్‌కు వీల్‌చైర్‌ను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రాహుల్ కోరిక నెరవేరడంతో అతని తల్లిదండ్రులు సీపీ బాడుగుల సుమతి, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ రష్మిత, మెరుగు శివకృష్ణలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

స్వచ్ఛంద సంస్థలు అంకితభావంతో పనిచేయాలి : పోలీస్ కమిషనర్ సుమతి

స్వచ్ఛంద సంస్థలు పేద ప్రజల కోసం అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారని నిస్వార్ధంగా ప్రజలకు సేవలు అందించాలని బడుగుల సుమతి స్వచ్ఛంద సంస్థల నేతలతో అన్నారు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలను వికలాంగులను అంగవైకల్యాకులను మూగ చెవిటి వారిని ఆప్యాయంగా పలకరించి సోదర భావంతో మెదగాలని బడుగుల సుమతి కోరారు స్వచ్ఛంద సంస్థలు సొసైటీలో ఎప్పటినుండో ప్రజలకు చేరువై ఎన్నో సేవ కార్యక్రమాలను చేయడంపై అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దామరపల్లి నర్సింహారెడ్డి , చింతల విజయ్ కుమార్, జినుక రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *