– హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలో వర్గాలు కొనసాగుతున్నాయని, పలు జిల్లాల్లో మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటితోపాటు నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొ న్నది. హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





