రాజీనామా చేయాల్సింది ఎవరు?

– రూపాయి జీతంతో పేదల కోసం పనిచేస్తున్న నేనా..
– అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్‌లో ఉన్న కేసీఆరా
– పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకు భయపడుతున్నారు
– మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 123 : ప్రతిపక్షాలు 22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న రాజకీయ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే అసత్య ప్రచారాలతో ప్రభుత్వాన్ని, తనను లక్ష్యంగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని నన్ను అడుగుతున్నారు.. మరి ప్రజాధనంతో ఇన్నేళ్లు అధికారాన్ని అనుభవించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వారు రాజీనామా చేయొద్దా అని మంత్రి నిలదీశారు. తాను ప్రతి నెలా ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకుంటూ పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ‘ప్రజల కోసం పనిచేస్తున్న నన్ను రాజీనామా చేయమంటారా’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.21 కోట్లT పొంది అసెంబ్లీకి, ప్రజలకు మొఖం చాటేసిన కే.సీ.ఆర్ రాజీనామా చేయరా అని హరీష్ రావును ప్రశించారు.

అధికారంలో ఉంటే అవినీతి.. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్

‘అధికారంలో ఉంటే అవినీతి.. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. మీ బ్లాక్‌మెయిల్‌కు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రభుత్వం ఇది కాదు’ అని స్పష్టం చేశారు. తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ ‘పొంగులేటి.. పొంగు’ అంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు.‘ పొంగులేటి.. పొంగు అని ఎందుకు పదేపదే అంటున్నారు.. ఎందుకు అంత భయం.. శుభకార్యంలో పాలు పొంగితే శుభం. కానీ గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపంలో పొంగితే ఆ పొంగులో మీరే కాదు.. మీ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుంది’ అని వ్యాఖ్యానించారు కే.సీ.ఆర్. కింద పొర్లాడినా మరోసారి ముఖ్యమంత్రి కాలేరని ఆనాడు ఖమ్మం సభలో తాను చెప్పినట్లుగానే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ సభలో కూర్చునేది కూడా ఇందిరమ్మ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *