– జేయూఏతో రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం
– రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో సమీక్ష
– డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
– రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో సమీక్ష
– డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో తాను శనివారం సమావేశమైనట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించామన్నారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడంతోపాటు ఈ కార్యాచరణను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ ఆఫీసర్‌ను వచ్చే వారంలోగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. దీంతోపాటు జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్(జేయూఏ)కు సంబంధించిన డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు.. వరుస సమావేశాలు, లేఖలు, నిరంతర సమన్వయం.. ఇవాళ తుది దశకు చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఉత్తర తెలంగాణ కనెక్టివిటీ విషయంలో దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ రీజనల్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అంశాన్ని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీనిపై స్పందించిన ఆయన ఆదిలాబాద్‌లో జేయÖఏను అభివృద్ధి చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారన్నారు. కాగా, ఈ ఎయిర్‌పోర్టుకు సంబంధించి రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య పలు సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగా రక్షణ, పౌర విమానయాన అధికారులు ఏప్రిల్ 17న ఆదిలాబాద్ వియానాశ్రయ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంలో 2.75 కిలోమీటర్ల రన్ వే నిర్మాణం అవసరమని నిర్ణయించారు. దీంతోపాట± ఐఏఎఫ్ వద్ద 369.45 ఎకరాల భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్, వెదర్ షెల్టర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్స్, ఆపరేషనల్ కాంప్లెక్స్, ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రా సదుపాయాలను కల్పిస్తామన్నారు. పౌర సేవలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్సు అథారిటీ (ఏఏఐ) ఒక సివిల్ టెర్మినల్‌తోపాటు మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్ (ఎమ్మార్వో) సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. వీటితోపాటు ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి నివాస, ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





