– భారత సంతతికి చెందిన యువతి కాల్చివేత
టోరంటో, జులై 27 : కెనడాలోని టొరంటో నగరంలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల భారత సంతతికి చెందిన నవ్‌నీత్ కౌర్ అనే యువతిని ఓ వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అని టొరంటో పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. శుక్రవారం ఉదయం 7:23 గంటల ప్రాంతంలో హంబర్‌వుడ్ బౌలేవర్డ్, రెక్స్‌డేల్ బౌలేవర్డ్ సపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్షసాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. నవ్‌నీత్ కౌర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, సదరు వ్యక్తి ఆమెను అనుసరించాడు. అతడు ఏదో మాట్లాడటంతో నవ్‌నీత్ వెనక్కి తిరిగి చూసింది. వారిద్దరి మధ్య స్వల్ప సంభాషణ జరిగింది. ఎలాంటి గొడవ లేదా వివాదం జరిగిన సూచనలు కనిపించకుండానే అతడు వెంటనే తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన నవ్‌నీత్‌కు అత్యవసర వైద్య సాయం అందించినప్పటికీ, ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన టొరంటో పోలీసులు, నిందితుడిని పట్టుకోవడానికి డ్రోన్లు, ప్రత్యేక డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నాటికి ఈ హత్య కేసులో నిందితుడైన 37 ఏళ్ల శరంజిత్ సింగ్ అనే వ్యక్తిని బ్రాంప్టన్ వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నిందితుడిపై ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కోర్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు కేసులు నమోదు చేశారు. హత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల హోమిసైడ్ టీమ్ విచారణ జరుపుతోంది. ఈ దాడిలో ఇతర నిందితుల ప్రమేయం ఏ లేదని, ఇది పూర్తిగా టార్గెటెడ్ దాడిగా భావిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా క్రైమ్ స్టాపర్స్’కు తెలపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




