డీజీపీ కార్యాలయంలో కాళోజీ జయంతి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయ‌న‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్, మల్టీ జోన్- II ఐజీ షానవాజ్ ఖాసిం, ఏఐజి అడ్మిన్ జె.అన్యోన్య , టి జి స్పార్క్ ఎస్పీ రూపేష్, పేషీ డీఎస్పీ భాస్కర్, స్టోర్స్ డీఎస్పీ సత్యనారాయణ, సీఎస్‌ఓ యోగేశ్వరరావుతోపాటు ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *