గడీల పాలనపై గర్జించిన ధీర వనిత ఐలమ్మ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా ఆ మహనీయురాలు ఎగరేసిన ధిక్కార పతాకం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి (10వ తేదీ) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని సీఎం గుర్తు చేశారు. సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. వారి ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

IIIIIIIIIII
సమాచార శాఖలో మట్టి గణపతుల పంపిణీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : వపర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడిని పూజించాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమల పంపిణీని కమిషనర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ పండుగలను పర్యావరణ పరిరక్షణలో భాగంగా భాద్యతాయుతంగా జరుపుకోవాలన్నారు. జల వనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు మట్టి గణపతిని మాత్రమే పూజించాలని కోరారు. ఈ ఉచిత గణపతి ప్రతిమల కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్.జగన్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *