హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : వపర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడిని పూజించాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమల పంపిణీని కమిషనర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ పండుగలను పర్యావరణ పరిరక్షణలో భాగంగా భాద్యతాయుతంగా జరుపుకోవాలన్నారు. జల వనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు మట్టి గణపతిని మాత్రమే పూజించాలని కోరారు. ఈ ఉచిత గణపతి ప్రతిమల కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్.జగన్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





