– హరీష్ రావు అసమర్థుడని ఆనాడే గుర్తించిన కెసిఆర్
– హుజూర్ నగర్ లో మోడల్ కాలనీకి మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన
నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 10: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధాన కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కువ మొత్తం ఖర్చు పెడితే ఎక్కువ కమీషన్ వస్తుందనే దురాశతోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి కాళేశ్వరం అని పేరు మార్చారని ఆరోపించారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా నువ్వు పనికిరావని మామే నిన్ను పదవి నుంచి తీసివేసి సర్టిఫికెట్ ఇచ్చాడు క దా అంటూ ఎద్దేవా చేశారు. రూ.38కోట్లతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేపట్టి కనీసం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రూ. 20 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ కాలనీ అ వృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కవిత ఆన్ రికార్డ్ చెప్పిన 1400 కోట్ల కమిషన్ వ్యవహారాన్ని ఆయన ఈ సంద ర్భంగా గుర్తుచేశారు. కనీసం మట్టి పరీక్షలు కూడా నిర్వహించకుండా, అధికారులు సూ చించిన చోట కాకుండా ఐదు కిలోటర్ల దూ రంలో, ఇసుకపై పునాది వేయడం వల్లే ప్రా జెక్టు కూలిపోతుందని సేఫ్టీ కంట్రోల్ ముందే హెచ్చరించినా బీఆర్ఎస్ వినలేదని ఉత్తమ్ మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేప్టీ టీమ్ హెచ్చరించినా పట్టించుకోకుండా.. ఇప్పుడు కాంగ్రెస్పై నిందలు వేయడం సరికా దన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని నిల్వ చేయొద్దని చెబుతున్నా.. బీఆర్ఎస్ నేతలు ఇంకా మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటకు వస్తున్న నీళ్లు ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కాళేశ్వరం నీళ్లు వదల్లేదని స్పష్టం చేశారు. తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్ తప్పులను సరిదిద్దుతూ.. డ్యామ్ సేప్టీ అధికారుల సూచనల మేరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





