ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం

– కండూ ఏఐ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్‌లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. కొండాపూర్‌లోని క్రిషే ఎమరాల్డ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ డిజైన్, హై-స్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్ డెవలప్‌మెంట్‌కు కీలక ఇంజనీరింగ్ హబ్‌గా సేవలందించనుంది. కార్యక్రమంలో కండూ ఏఐ సీఈఓ, కో-ఫౌండర్ సృజన్ లింగతోపాటు సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, ఉద్యోగులు, భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్‌టెక్, ఏఐ రంగాలకు విశ్వసనీయ గమ్యస్థానంగా ఎదగడం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దూరదృష్టి విధానాల ఫలితమని అన్నారు. ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, అత్యుత్తమ మౌలిక సదుపాయాల కారణంగానే ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను తమ విస్తరణకు ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు కండూ ఏఐ తన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం నగర ప్రతిష్ఠను మరింత పెంచుతుందన్నారు. ఈ సంస్థ ద్వారా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు, సెమీకండక్టర్ పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కండూ ఏఐ సీఈఓ, కో-ఫౌండర్ సృజన్ లింగ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ ఇంజనీరింగ్ ప్రతిభకు హైదరాబాద్ అత్యుత్తమ కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. సంస్థ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో స్థానిక ప్రతిభను మరింత ప్రోత్సహిస్తూ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ కేంద్రంలో చిప్ డిజైన్, వెరిఫికేషన్, వాలిడేషన్, ఫర్మ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి కీలక విభాగాలు పనిచేయనున్నాయి. దీంతో కండూ ఏఐ గ్లోబల్ ఇంజనీరింగ్ నెట్‌వర్క్ మరింత బలోపేతం కావడంతోపాటు హైదరాబాద్ అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *