– అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొన్న బస్సు
– జనగామలో వింత సంఘటన
జనగామ, ప్రజాతంత్ర, జూలై 10: జన గామ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం కలకలం రేపింది. జన గామ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన అద్దె బస్సును ఎవరికి తెలియకుండా స్థా ర్ట్ చేసి తీసుకెళ్లాడు. సుమారు 21 కిలో టర్లు బస్సును నడిపించి చివరకు ప్రమా దానికి గురయ్యాడు. ఈ ఘటనతో ప్ర యాణికులు, స్థానికులు తీవ్ర భయాందో ళనకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ బస్సు లోనే తాళాలు వదిలేసి ఇంటికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించిన పాలకుర్తి మండలం చెన్నూరు కు చెంది న బుల్డోజర్ డ్రైవర్ జిట్టబోయిన వెంక న్న మద్యం మత్తులో బస్సును స్టార్ట్ చేసి అక్క డి నుంచి సూర్యాపేట వైపు తీసుకె ళ్లాడు. జనగామ నుంచి బస్సును నడిపి స్తూ వెళ్లిన వెంకన్న, దేవరుప్పుల మం డలం సింగరాజుపల్లి టోల్ గేట్ సపానికి చేరుకున్నాడు. అక్కడ బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన టోలేట్ సిబ్బంది అనుమా సంతో వెంటనే దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దేవరుప్పుల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు వెంకన్నను బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జనగామ పోలీసులకు అప్పగించారు. అద్దె బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం మత్తులోనే బస్సును ఎత్తుకెళ్లాడా.. సంఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు ఏంటనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





