సినీ పరిశోధన కేంద్రం కానున్న‌ ‘కఫిసో’ ఆడిటోరియం

 – ఘనంగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నూతన ఆడిటోరియం భూమి పూజ
– హాజ‌రైన సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్
– సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రూ.6 లక్షల విరాళం ప్రకటన

కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్‌ 26: నూతన ఆడిటోరియం కరీంనగర్‌కు సినీ పరి శోధన కేంద్రం కానుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ డైరెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. కఫీసో శనివారం ఉదయం కరీంనగర్ పద్మా నగర్ బైపాస్ రోడ్ లో ఫిలిం సొసైటీ కి నూతన ఆడిటోరియం నిర్మాణానికి భూమి పూజ ఘ‌నంగా జ‌రిగింది. ఖ్య అతిథిగా శ్యాంప్ర‌సాద్ మాట్లాడుతూ యాభ‌య్యేళ్ల‌ చరిత్ర కలిగిన ఫిలిం సొసైటీ విభిన్న కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. కఫీసో ఆడిటోరియం ఇంతవరకు దేశంలో రెండవ స్థానంలో ఉంద‌ని, ఈ నూతన ఆడిటోరియం నిర్మాణం పూర్త‌యితే మొదటి స్థానంలోనికి వస్తుందని తెలిపారు. ఇది ఉమ్మడి కరీంనగర్ వాసుల కల నెరవేరబోయే సమయమ‌ని అన్నారు. విశిష్ట అతిథి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కఫీసో ఆడిటోరియం ఒక పరిశోధన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు. దీనిలో ఆదినుంచి సినిమా చరిత్ర, నిర్మాణం, కళ సినీ సాహిత్యం అన్ని ఒకేచోట దొరుకుతాయని తెలిపారు. కఫీసో ఆడిటోరియం ఓ గొప్ప ఆదర్శప్రాయం కానుందని, కరీంనగర్ చరిత్రలో ఇదొక మైలురాయిలుగా నిలిచిపోతుందని అన్నారు.  మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఫిలిం సొసైటీ విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంద‌ని తెలిపారు . వివిధ భాషల చిత్రాలను ప్రదర్శించి సినీ సాహిత్యం ద్వారా పిల్లల్లో గొప్ప చైతన్యాన్ని కలగజేసినట్లు గుర్తు చేశారు. భాషా సాంస్కృతిక శాఖ సమన్వయంతో అనేక కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషం కలిగిందన్నారు.

రూ.6లక్షల విరాళం ప్రకటించిన రవిచంద్ర

కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రవిచంద్ర ఆడిటోరియం నిర్మాణానికి తన వంతు రూ.6లక్షల విరాళం ప్రకటించారు. ఆడిటోరియం నిర్మాణంలో పై భాగంలో 70ఎంఎం స్క్రీన్ డాల్వి సౌండ్ సిస్టం ఉంటుందన్నారు. కింద సమావేశ మందిరం గెస్ట్ రూమ్స్, లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, భారతీయ సినిమాలను ప్రతిబింబించేట్లు మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేపటి నుంచి పనులు ప్రారంభించి త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.  సహృదయుల నుంచి విరాళాలను ఆశిస్తున్నామన్నారు. ­కార్యక్రమానికి ముందు ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ నివేదికన సమర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, పూర్వ సర్పంచ్ గడ్డం శ్రీరాములు, సలహాదారు వరాల మహేష్, సాహితీ గౌతమి అధ్య‌క్షుడు నంది శ్రీనివాస్, బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నవరం దేవేందర్ లు ప్రసంగించారు. డాక్టర్ నలిమెల, చక్రధర్ రావు రూ.50వేల , కలర్ సత్తన్న రూ.10వేల విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో కోశాధికారి సిహెచ్.అనిల్ కుమార్, కే.వెంకటేశం, గాజోజు నాగభూషణం, ప్రకృతి సురేష్, పణిత మునిపల్లి, కందుకూరి అంజయ్య, దశరథం, అనిల్ కుమార్ గౌడ్, పొన్నం శ్రీనివాస్, సదా శ్రీ, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, తంగెడ అశోక్ రావు, సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ అభిమానులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *