ఏకమవుతున్న ఎర్ర సూర్యులు

– రాష్ట్రంలో రాజకీయ కొత్త కూటమి
– విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ నేతృత్వంలో ఐక్య కూటమి
– ఈనెల 20న రాజధానిలో తొలి సమావేశం
– సుమారు పది వామపక్ష పార్టీల ప్రతినిధుల హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఏకమవుతున్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడబోతోంది. ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమై దేశానికి దిక్సూచిలా తయార య్యేందుకు ముందుకు వస్తున్నాయి. కేంద్రంలోని మత తత్వ బిజెపిని గద్దెదించాలనే లక్ష్యంతో పాటు పేద ప్రజల కు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి ధ్యేయంగా ఎర్ర సూర్యు లు ఏకం కాబోతున్నారు. వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పక్కనపెట్టి ఐక్య కూటమిగా ఏర్పడడం శుభపరిణామమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ కూటమికి విశ్రాంత న్యా యమూర్తి చంద్రకుమార్ నేతృత్వం వహించబోతున్నా రు. ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీలన్నిటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు మేధావి వర్గం ముందుకు వస్తున్నది. ఈనెల 20న రాష్ట్ర రాజధానిలో భారీ సభను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ కమ్యూనిస్టు శక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కమ్యూనిస్టు పార్టీల నాయ కత్వం కూడా ఐక్య కూటమితోనే బూర్జువా పార్టీలపై విజయం సాధించి పేదలకు మేలు చేయవచ్చునని భావించి జట్టు కట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటివరకు వేర్వేరుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎర్రజెండా పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో మేధావులు, ప్రజా ఉద్యమాల ప్రతినిధు లు కొంత కా లం నుంచి చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. వామపక్ష శక్తుల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఐక్యంగా ముందుకు సాగాలనే
ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చి ఆచరణలో పెట్టనున్నట్లు సమాచారం. ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండా.. ప్రతిపాదిత కూటమి ప్రజా సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా  తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఉచిత, నాణ్యమైన విద్య అందించడం, అందరికీ అందుబాటులో ఉండే వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశా లను ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో మతతత్వ రాజకీయాల కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను ఏకం చేయడం కూడా కూటమి లక్ష్యాల్లో ఒకటిగా ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త ఐక్య వేదిక కు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ నాయ కత్వం వహించే అ వకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గా ల్లో జోరుగా సాగు తోంది. వివిధ కమ్యూనిస్టు పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆయన నేతృత్వం వహించనున్నారు. అయితే కూటమి తుది స్వ రూపం, నాయకత్వ నిర్మాణం, భాగస్వా మ్య పార్టీల వివ రాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

20న హైదరాబాద్ లో సమావేశం

ఈనెల 20 ఆదివారం రోజున హైదరాబాదులోని సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సమావేశం ప్రారంభం కాను న్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. సభకు వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధు లు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారానే కొత్త రాజకీయ కూటమి లక్ష్యాలు, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచ రణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వివిధ రాజకీయ శక్తుల మధ్య పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో వామపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీక రణాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను కేం ద్రంగా చేసుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ని ర్మించాలనే ప్రయత్నం ఏ మేరకు ప్రజల మద్దతును కూడ గడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలకు హైదరాబాద్లో జరగనున్న సభలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కూటమిలోని పార్టీలు
రాష్ట్రంలో బలంగా ఉన్న సిపిఐ, సిపిఎంతోపాటు సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, సిపిఐ (ఎంఎల్) న్యూడె మోక్రసీ, సిపిఐ(ఫార్వర్డ్ బ్లాక్), ఎంసిపిఐ(యు), మొదలైన పార్టీలు ఈ ఐక్య కూటమిలో చేరనున్నా యి. కొంతకాలంగా ఈ పార్టీల ముఖ్యనాయకత్వం తో కూటమిలోని మేధావి వర్గం చర్చలు జరిపి విజ యవంతమయింది. పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేయగా మరో రెండు రోజుల్లో తొలి సమావేశం హైదరాబాదులో నిర్వహించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *