హసన్ పర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : హసన్ పర్తి మండలం మండలం అనంతసాగర్ వద్ద గల ఎస్సార్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు ఇనుప రాడ్ తలఫై పడి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. హసన్పర్తి ఇన్స్పెక్టర్ ఆకునూరి మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం లాతేహార్ జిల్లా, మురుపు పోస్ట్, బాలుగాడి గ్రామానికి చెందిన పప్పు కుమార్ (31) తన సోదరుడు గుడ్డు భుయ్య, తోటి మేస్త్రీ ప్రదీప్ తో కలిసి బతుకుదెరువు కోసం వరంగల్ వచ్చారు. ఎస్సార్ యూనివర్సిటీ భవన నిర్మాణంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నారు. ఈనెల 9న ఉదయం 7:30 గంటల సమయంలో భవనం 4వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4వ అంతస్తుకు ఇనుప రాడ్లను రవాణా చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక ఇనుప రాడ్ 4వ అంతస్తు నుంచి కింద పడి పప్పు కుమార్ తలకు గుచ్చుకుంది. కుమార్ ను వెంటనే అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు గుడ్డు భుయ్య ఫిర్యాదు మేరకు హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ మహేందర్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





