కిట్స్ విద్యార్థులకు రూ.11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

– క్యాంపస్ డ్రైవ్‌లో ఈఈఈ ఫైన‌లియ‌ర్‌ విద్యార్థుల ప్రతిభ 
– అభినందించిన చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంత రావు

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12 : వరంగల్ కిట్స్ క‌ళాశాల విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాల ప్రాంగణంలో శ‌నివారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జి ఈ వెర్నోవా లో రూ.11 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగపు ఐదుగురు బిటెక్ చివరి సంవత్సరం (7వ సెమిస్టర్) విద్యార్థులు ‘ఇంజనీర్’ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన‌ వారిలో కొండ రిత్విక్, తుమ్మ మణిరిత్విక్, అనుమాండ్ల రుత్విక్ రెడ్డి, బొడ్డుల నీరజ్, అన్నందాస్ శ్రావణి ఉన్నారని కిట్స్ చైర్మ‌న్‌ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాబోయే రోజుల్లో కిట్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సాంకేతిక ప్రపంచ దిగ్గజ ఎంఎంసీలు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని, అనేక కంపెనీలు లైన్‌లో ఉన్నాయని కిట్స్ కోశాధికారి పి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీన్, అకడమిక్ అఫైర్స్ ప్రొఫెస‌ర్‌ సూర నరసింహా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లవేళలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉద్యోగ సముపార్జనలో నిమగ్నం కావాలని సూచించారు. కంపెనీ వారు రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్ & ఇంటర్వ్యూ  రౌండ్లను మూడు దశలలో  నిర్వహించారు. అధిక  సిటిసితో ప్లేస్‌మెంట్‌లను పొందడానికి స్థిరమైన అభ్యాసం, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమ‌ని తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి, డీన్ ట్రైనింగ్ & ప్లేస్ మెంట్స్ ప్రొఫెసర్ వై.పురందర్,  టి.పి.ఓ. డాక్ట‌ర్‌ సిహెచ్. సతీష్ చంద్ర, డీన్, ఈఈఈ  విభాగాదిపతి డాక్టర్ ఎం.నరసింహారావు, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ.కిరణ్ కుమార్, ఈఈఈ  విభాగం అకడమిక్ సమన్వయకర్త డాక్టర్ బి.జగదీష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, వివిధ విభాగాల డీన్స్, అధిపతులు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆర్ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, ఆప్టిట్యూడ్ ట్రైనర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్ పవన్, జి.ధనుష్, డి.శరత్, పి.సింధూర, వివిధ విభాగాల హెడ్‌లు, డీన్‌లు,  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *