సర్కారు వైద్యం.. రోగుల బేజారు

– ల్యాబ్ రిపోర్టులకే వారం రోజులు
– రోజుల తరబడి రోగుల నిరీక్షణ
– రక్తం నిల్వ చేసే మెషీన్ పాడైందని మళ్లీ శాంపిళ్లు సేకరించిన సిబ్బంది
– సర్వర్ డౌన్, సిబ్బంది కొరతతో ఇంటర్న్షిప్ నర్సింగ్ విద్యార్థులపైనే పర్యవేక్షణ భారం
– మరో రోజు వస్తే మారుతున్న డాక్టర్లు.. రోగులకు తప్పని తిప్పలు

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలో ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వ హిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య సేవల దుస్థితి చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందకపోగా కనీస వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు చేతికి రావడానికే వారం రోజులు పడుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగర శివారులోని ఓ గ్రామానికి చెందిన ఒక రు అనారోగ్య బారిన పడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఓపీ చిట్టి కోసం గంట క్యూ లైన్ లో నిల్చున్నారు. డాక్టర్ దగ్గ రకు వెళితే మరో గంట.. డాక్టర్ పలు రకాల ల్యాబ్ పరీక్షలు రాశారు. ఈ నెల 7న రక్త పరీక్ష అనంతరం రిపోర్టు కోసం మళ్లీ రమ న్నారు. 9వ వెళితే రక్తం నిల్వ చేసే మెషిన్ పనిచేయడం లేదని మళ్లీ పరీక్ష కోసం రక్తం. సేకరించారు. శనివారం వస్తే నివేదిక కోసం మళ్లీ రావాలని సూచించారు. ల్యాబ్ రిపోర్ట్ కోసమే వారం రోజులు దాటితే రోగం తగ్గిదేప్పుడని రోగులు గగ్గోలుపెడుతు న్నారు. ఇది ముగ్గురు మంత్రులు ఉన్న ఖ మ్మంలోని ప్రభుత్వ వైద్య సేవల దుస్ధితి, జిల్లా ఆస్పత్రిలో కొన్ని రోజులుగా లాబ్ రిపోర్టులు సమయానికి అందడం లేదు. గతంలో పరీక్ష లు చేయించుకున్న 24 గంటల్లోనే సెల్ ఫోన్ కు రిపోర్టులు వచ్చేవి. కానీ కొద్దిరోజులుగా ఆ పరిస్థితి మారింది. రిపోర్టుల కోసం రోగు లు, వారి బంధువులు కౌంటర్ వద్ద అడిగితే కూడా ప్రింట్ తీసి ఇవ్వడానికి నెట్ రావడం లేదని, సర్వర్ పని చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. జ్వరం, నీరసంతో దవాఖా సకు వచ్చిన రోగులకు వ్యాధినిర్ధారణ పరీక్షల రిపోర్టులు అందే సరికి మరింత నీరసపడిపో తున్నారు. మరో రోజు రిపోర్టులు ఇస్తుండ డంతో ముందురోజు చూసిన వైద్యులు ఓపీలో లేకపోతుండంతో మళ్లీ కొత్త వైద్యునికి తమ సమస్యను చెప్పుకోవాల్సి వస్తోందని వాపోతు న్నారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రికి అనుసంధానం గా మాతాశిశు సంరక్షణ కేంద్రం, జనరల్ ఆస్పత్రి, టీహబ్ లు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం ఎంసీహెచ్ నుంచి 300కు పైగా, జన రల్ ఆస్పత్రిలో సెంట్రల్ ల్యాబ్ కు 500, టీ హబ్ కు మరో 300 మంది వరకు రక్త పరీ క్షల కోసం శ్యాంపిళ్లు తీస్తుంటారు. ఇక్కడ తీసిన రక్తనమూనాల నివేదికలు మాత్రం రోజుల తరబడి రావడం లేదు. టీహబ్లో రిపో ర్థులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని. వీటి కోసం మరో రోజు రావాల్సి వస్తోందని వాపోతున్నారు. జ్వరం, నీరసంతో దవాఖాసకు వచ్చిన రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు అందేసరికి మరింత నీరసపడిపోతున్నారు. మరో రోజు రిపోర్టులు ఇస్తుండడంతో ముందు రోజు చూసిన వైద్యులు ఓపీలో లేకపోతుండంతో మళ్లీ కొత్త వైద్యునికి తమ సమస్యను చెప్పుకోవాల్సి వస్తోందని వాపోతున్నరు.

ఇంటర్న్షిప్ విద్యార్థులపై భారం

కొన్ని రోజులుగా శ్యాంపిళ్లను సేకరిస్తున్నా రిపోర్టులు మాత్రం మొబైల్ ఫోన్లకు రావడం లేదు. వీటి కోసం ఆస్పత్రికి వస్తే రాలేదంటూ చెబుతున్నారు. ఇక సెంట్రల్ ల్యాబ్లో నిర్వ హించే పరీక్షల నివేదికల కోసం నిరీక్షిస్తున్నారు. వారం రోజులుగా జిల్లా ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. నిత్యం వందల సంఖ్యలో రక్త పరీక్షల కోసం వస్తున్నారు. జిల్లాలో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో వైద్యు లు జ్వరాల నిర్ధారణ కోసం పరీక్షలు రాస్తున్నారు. నివేదికల ఆధారంగా చికిత్స అందిం చాల్సి ఉంటుంది. రోజుల తరబడి నివేదికలు, రిపోర్టుల కోసం నిరీక్షించి నీరసిస్తున్నారు. దీంతో మరో రోజు రావాల్సి వస్తోంది. సర్వర్ రాకపోవడం, ఇక్కడ రోగుల రద్దీకి తగినట్టు సిబ్బందిని ల్యాబ్ టెక్నీషియన్లను ఏర్పాటు చేయకపోవడంతో పాటు పూర్తిగా ఇంటర్న్ షిప్ కోసం వచ్చే నర్సింగ్ విద్యార్థులపై భారాన్ని వదిలిపెట్టి చేతులు దులుపుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇబ్బం దులు లేకుండా చూడాలని రోగులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *