– మంత్రి సమాధానం తప్పుదారి పట్టించేలా ఉంది
– 100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 33 మందినే నియమించారు
– 70 పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చడంపై ఎమ్మెల్సీ పోచంపల్లి ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : డీఎస్సీ (2024) ఉపాధ్యాయ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయుల నియామ కాపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు క్రీడా శాఖ మంత్రి శ్రీహరి ఇచ్చిన సమాధానం తప్పుదారి పట్టించేలా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు తన దృష్టికి రాలేదంటూ మంత్రి తప్పిం చుకునే యత్నం చేయడంపై జాతీయ క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో చేపట్టిన స్పోర్ట్స్ కోటాలో టీచర్ల నియామకల్లో తప్పులు దొర్లాయని, వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. క్రీడాకారుల కోసం ఎంతో చేస్తు న్నామని, అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబు తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బయట చెప్పేది ఒకటి.. ఆచరణలో మరొకటి చేస్తోందని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. 2024 డీఎస్సీ టీచర్ నియామ కాల్లో స్పోర్ట్స్ కోటాలో 100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 33 పోస్టులను మాత్రమే భర్తి చేసి మిగిలిన పోస్టులను జనరల్ కు మార్చారని సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు జరిగిన అన్యాయంపై ఆయన ప్రశ్నించారు. చాలామంది జాతీయ స్థా యి క్రీడాకారులకు ఉద్యోగాలు రాకుండా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లినవారికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదని, కనీసం కోర్టుకు కూడా ప్రభుత్వం తరుపున కౌంటర్ అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల జాతీయ క్రీడాకారులకు ఉద్యోగా లు రాకుండా పోతున్నాయని తెలిపారు. జనరల్‌కు మార్చిన 70 పోస్టులను మళ్లీ స్పోర్ట్స్ కోటాలో నియమకాలు చేయాలని సభ దృష్టికి తీసుకొస్తే, క్రీడా శాఖ మంత్రి ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎవరూ తనను కలిసి చెప్పలే దని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై రీ వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని జాతీ య క్రీడాకారులందరూ 2025 సెప్టెంబర్‌లో క్రీడా శాఖ మంత్రిని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు. రీవెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసేందు కు అధికారులతో మాట్లాడుతానని క్రీడామంత్రి హామీ ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు కలిసినా పరిశీలన లో ఉందంటూ దాటవేస్తున్నారని, ఇప్పటివరకు రీవెరిఫికేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడం వల్ల తమకు ఉద్యోగాలు రావడంలేదని జాతీయ క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. పోచంపల్లి అడిగిన ప్రశ్నకు తప్పుదారి పట్టించేలా క్రీడ శాఖ మంత్రి కనీసం తమ దృష్టికి రాలేదని చెప్పడం సరికాదన్నారు. ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చిన ఫోటోలను బాధితులు మీడియాకు చూపించారు. ఇదే అంశంపై స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గత ఆగస్టులో క్రీడాశాఖకు పంపిన లేఖను సైతం అభ్యర్ధులు చూపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాతీయ స్థాయి క్రీడాకారులు వేడుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





