రంగారెడ్డి జిల్లాలో రియల్టర్‌ ఆత్మహత్య

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌శివారు రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారి, హోమ్‌ ‌ల్యాండ్‌ ‌సంస్థ అధినేత రామ్‌ ‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరు మండలం నెదునూరు గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన బలవన్మరణం చెందారు. రామ్‌ ‌రెడ్డి పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొందరు రాజకీయ నాయకుల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *