హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11: రాయదుర్గం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అంజయ్య నగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో శశిధర్(43) వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శివబాలాజీ హాస్టల్‌లో ప్రమోద్ అనే వ్యక్తి చాఫ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఏదో విషయంపై చిన్న గొడవ జరిగింది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ప్రమోద్ కత్తితో శశిధర్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన శశిధర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా డుమురియా మండలం సరాధా గ్రామానికి చెందిన శశిధర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న ప్రమోద్ స్వస్థలం బాలేశ్వర్ జిల్లా బెల్గోనియా గ్రామంగా గుర్తించారు. అసలు ఈ హత్యకు కారణం ఏమిటి? శశిధర్, ప్రమోద్ మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? హత్యకు ముందు ఇద్దరి మధ్య ఏం జరిగింది? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





