హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6 నుంచి 12 వ తేదీ వరకు క్యాంపును నిర్వహించగా పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న 19మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారు. ఇందులో కేవలం రెండు కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





