న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్ ఘన విజయం సాధించారు. అసోసియేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జంధ్యాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి ఉమ్మడి ఆంధప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. గతంలో ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్లు, గవర్నర్లకు న్యాయ సలహాదారుగా రవిశంకర్ విశేష సేవలు అందించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. 2023 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రవిశంకర్ పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్లలో అసెంబ్లీ స్పీకర్ తరఫున రవిశంకర్ వాదనలు వినిపిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




