జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్‌
‌స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా
బిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం

: చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అటువంటి స్పీకర్‌ ‌ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా మొత్తం సభనే అవమానించడమని మంత్రి అన్నారు. స్పీకర్‌ ‌మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అంటుంటే కూడా సరిదిద్దుకోకుండా ..సభ ది కాదు అని మాట్లాడిన జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడని అన్నారు. ఇంత చేసి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ ‌నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఇవన్నీ గమనిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం కూడా జగదీశ్వర్‌ ‌రెడ్డి చేసింది తప్పు.. స్పీకర్‌ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదంటే వారికి సభ పట్ల ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. అడ్డంగా సభావేదికగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి, ధర్నాలు చేయడం  ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే ఈరోజు నిరసనలు తెలుపుతున్నారని పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు.

రాష్ట్రంలో నిరసనలకు బీఆర్‌ఎస్‌ ‌పిలుపునివ్వం హాస్యాస్పదమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానమైనా  బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి రావాలని పేర్కొన్నారు. సభలో ఏ విధంగా ఉండాలి, సభ వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని అనేది అర్థమవుతోందని అన్నారు.

ఇది ప్రజలు గమనించాలి.. సభకు కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయన్నారు. దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారని మాట్లాడుతున్నారు.. ఇదే బీఆర్‌ఎస్‌ ‌గతంలో శాసన మండలి చైర్మన్‌ ‌ద కాగితాలు పడేసారని ఇద్దరు సభ్యులను తొలగించి బర్తరఫ్‌ ‌చేశారు.. ప్రజాస్వామ్యంలో ఇది మర్చిపోయారా?.. ఇటువంటి మాటలు, నిరసనలు వద్దు ఎందుకంటే ఇది బీఆర్‌ఎస్‌కి మంచిది కాదని పొన్నం ప్రభాకర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *