మీ బ‌లం ఇదేనా?

– మోదీపై అభిజీత్‌ దీప్కే నిప్పులు

దిల్లీ, అక్టోబ‌ర్ 19: జాతీయ పతాకాన్ని ప్రదర్శించేందుకు జంతర్ మంతర్ వద్దకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ ల అరెస్ట్ ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇద్దరు యువకులను జైలులో ఉంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకోవడం ద్వారా మోదీ తనను తాను బలమైన నాయకుడిగా భ్రమిస్తున్నారని, నిజానికి అది పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. ఐదు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించినప్పటికీ సౌరవ్ దాస్, ఆశుతోష్‌లు ఎలాంటి భయానికి లోనవ్వకుండా చిరునవ్వుతో కోర్టుకు హాజరయ్యారని, అదే నిజమైన ధైర్యమని దీప్తే కొనియాడారు. కష్టకాలంలోనూ ఆ యువకుల తల్లులు, కుటుంబ సభ్యులు ఎక్కడా వెనకడుగు వేయకుండా అత్యంత స్థైర్యంతో నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగం, యువత సమస్యలు, విదేశాంగ విధానాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. యువత గొంతును ఎప్పటికీ అణచివేయలేరని స్పష్టం చేశారు. తమ నేతల విడుదలను అడ్డుకోవడానికి అధికారులు ఉద్దేశపూర్వకంగానే విచారణను వాయిదా వేస్తూ బెయిల్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

గమనిక: ఇది సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు మరియు ఆరోపణల ఆధారంగా రూపొందించిన కథనం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *