‘కాలర్ ఐడీ ఫీచర్ తప్పనిసరి!

– వొచ్చే నెల 1 నుంచి అమలులోకి
– ఫోన్ స్క్రీన్ లపై కాల్ చేసిన వ్యక్తుల పేర్లు ప్రదర్శించాలని టెలికాం శాఖ ఆదేశం

దిల్లీ, అక్టోబర్ 16: దేశ వ్యాప్తంగా వొచ్చే నెల 1 నుంచి అన్ని టెలికం కంపెనీలు కాలర్ ఐడీ ఫీచర్ ను అందుబాటులోకి తేవడాన్ని టెలికమ్యూనికేషన్ల విభాగం తప్పనిసరి చేసింది. దీని ప్రకారం అన్ని సెల్యూలర్ నెట్వర్క్ ఫోన్లలో కాల్ చేసిన వ్యక్తుల పేర్లను ఫోన్ స్క్రీన్లపై కంపెనీలు ప్రదర్శించాలి. ఈ సేవను ఉచితంగా అందించాలి. ఇందుకు సంబంధించి కంపెనీలు తమ చందాదారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో లింకైన పేర్ల డాటాబేస్ ను కలిగి ఉండాలి. టెలికం కంపెనీలు కాలర్ వివరాలను వారి సర్వీస్ ప్రొవైడర్ నుంచి సేకరించి, కాల్ చేసిన వ్యక్తి సరైన పేరును కాల్ అందుకొనే వ్యక్తి ఫోన్ స్క్రీన్  పై ప్రదర్శించాలి. విదేశాల నుంచి వచ్చే కాల్స్ కు సంబంధించి, ఫోన్ నంబర్ల పక్కన ‘ఇంటర్నేషనల్’ అని ఉంటుంది. అయితే కాలింగ్ లైన్ గుర్తింపు నిరోధకత సదుపాయాన్ని ఎంచుకొన్న వ్యక్తుల పేర్లు మాత్రం స్క్రీన్  పై ప్రదర్శించబడవు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *