– సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిర్బంధం
– కన్నాట్ ప్లేస్లో త్రివర్ణ పతాక ప్రదర్శనకు పోలీసుల అడ్డంకులు
– విద్యార్థి నాయకురాలు నేహా బోరా కూడా అదుపులోకి
– సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల విడుదల కోసం ఉద్యమం
– ఎస్ఐఆర్ వివాదంపై న్యాయపోరాటం కొనసాగింపు
ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | దిల్లీ | అక్టోబర్ 16: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు పలువురు కార్యకర్తలు, విద్యార్థి నాయకురాలు నేహా బోరా కూడా నిర్బంధానికి గురయ్యారు. దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వద్ద శుక్రవారం త్రివర్ణ పతాక ప్రదర్శన నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముందుగానే పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్ను మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు.ఈ నేపథ్యంలో ప్రదర్శనకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన అభిజీత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. నేహా బోరాతోపాటు పలువురు నిరసనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా సుప్రీంకోర్టు తదుపరి విచారణ తేదీలను ఖరారుచేసింది. అక్టోబర్ 15న విచారించిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు అంశాలవారీగా వేరు చేసింది. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎస్ఐఆర్ పిటిషన్ పిటిషన్పై ఈనెల 27న, జంతర్మంతర్ నిరసన స్థలం, పోలీసు ఆంక్షలపై నవంబర్ 3న,మహిళా జర్నలిస్టులపై వేధింపుల ఆరోపణలపై నవంబర్ 5న విచారణ జరుగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




