అవినీతికి మాగాణం అవుతున్న తెలంగాణ!

గత రెండు మూడు వారాల్లో కొందరు ప్రభుత్వాధికారుల ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో బైటపడిన నోట్ల కట్టలు, వెండి బంగారాలు, స్థిరాస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, వాహనాలు, చరాస్తుల వివరాలు చూస్తుంటే కిందిస్థాయి సగటు అధికారుల దగ్గరే ఇంతింత సంపద పోగుపడి ఉంటే, విధాన నిర్ణేతలైన, అక్రమార్జనకు నిలయాలైన ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల, మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ల మీద దాడి చేసి సోదా చేయగల అవకాశమే…
