ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా ఫెర్టీ-9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఏడాది ఈఎస్‌హెచ్ ఆర్ ఈ 2026లో 4 పరిశోధనా పత్రాలు, ఒక ఓరల్ ప్రజెంటేషన్, జపాన్‌లోని టోక్యోలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో 4 పరిశోధనా పత్రాలు, అలాగే యాస్పైర్ కాన్ఫరెన్స్ లో 11 పరిశోధనా పత్రాలను ఫెర్టీ9 వైద్య నిపుణులు సమర్పించారు. గత ఐదేళ్లుగా నిర్వహించిన ఐయూఐ చికిత్సల ఫలితాలపై ఆధారపడి చేసిన ఈ పరిశోధనలో మహిళల పెరుగుతున్న వివాహ వయస్సు, ఉద్యోగ జీవనశైలి, నైట్ షిఫ్ట్‌ల ప్రభావం, అలాగే పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం, డీఎన్ ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించారు. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇది 1.8, ఆంధ్రప్రదేశ్‌లో 1.7కు చేరిందని ఫెర్టీ9 పేర్కొంది. డా. విజయ మాధురి, డా. శ్రావ్య, ఫెర్టీ9 బంజారాహిల్స్ మాట్లాడుతూ… “సంతాన సమస్యలపై సమాజంలో అవగాహన పెరగడం ఎంతో అవసరం. ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సలు, సమయానికి నిర్ధారణ, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన చికిత్సా విధానాలతో విజయవంతమైన గర్భధారణ అవకాశాలను మరింత పెంచవచ్చు. ఫెర్టీ9 బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా ప్రతి దంపతికి నాణ్యమైన, విశ్వసనీయ ఫెర్టిలిటీ సేవలను అందిస్తున్నాము” అని తెలిపారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెర్టీ9 తన అన్ని 11 కేంద్రాల్లో నీడిల్-ఫ్రీ ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా రోజువారీ ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పి, ఆందోళనను తగ్గించవచ్చని సంస్థ తెలిపింది. అదనంగా, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రజనన ఆరోగ్య పరిశోధనలపై కూడా ఫెర్టీ9 పని చేస్తోంది. దీని ద్వారా విజయశాతాన్ని పెంచడం, ఇంప్లాంటేషన్ వైఫల్యాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, గర్భస్రావాల నివారణకు ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దంపతులకు మరింత ఆధునిక ఫెర్టిలిటీ సేవలను అందించేందుకు ఫెర్టీ9 కృషి చేయనుంది. ఫెర్టీ9 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 11 ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఫెర్టిలిటీ సెంటర్ అత్యాధునిక వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ చికిత్సలతో వేలాది మంది దంపతులకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అందిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





