– 13 ఏళ్ల నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : దేశ గతిని మలుపు తిప్పి దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిన చారిత్రక ఘట్టానికి 13 ఏళ్లు.. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘నవభారత యువభేరి’ వేదికగా సరిగ్గా ఇదేరోజు(11 ఆగస్టు, 2013 నాడు) ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన దృశ్యాలు ఇవాల్టికీ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో నాటి అనుభవాన్ని పోస్టు చేశారు. పబ్లిక్ మీటింగ్స్ చరిత్రలోనే తొలిసారిగా డెలిగేషన్ ఫీజును చెల్లించి మరీ లక్షలాదిమంది ఎల్‌బీ స్టేడియానికి తరలి వచ్చి నరేంద్రమోదీకి తమ సంపూర్ణమైన మద్దతును తెలియజేశారన్నారు. నాడు మన హైదరాబాద్ వేదికగా పడిన నరేంద్రమోదీ తొలి అడుగు తర్వాత దేశ రాజకీయాల్లో బీజేపీ సంచలన విజయాలతో దినదిన ప్రవర్థమానమైందని, వారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ‘వికసిత భారత్ సంకల్పం-2047’ లక్ష్యాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతోందని తెలిపారు. ఈ చారిత్రకమైన సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తాను 13 ఏళ్ల నాటి ఆ అద్భుతమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





