– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. కార్ఖానాలో బాధితుల ఆందోళనలో ఆయన పాల్గొని వారికి బీజేపీ తరఫున సంఘీభావం తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అందరూ సహకరిస్తున్నారని, అయితే తమ ఆస్తులను త్యాగం చేస్తున్న ప్రజలకు సరైన విలువతో కూడిన న్యాయమైన పరిహారం అందాల్సిన అవసరం ఉందని అన్నారు. తూంకుంట ప్రాంతంలో భూముల పరిహారాన్ని పెంచిన విధంగా రాజీవ్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న కార్ఖానా ప్రాంత ప్రజలకు కూడా తగిన మేర పరిహారం పెంచాలని ఆయన కోరారు. తూంకుంటలో పెంచిన పరిహారం కంటే ఈ ప్రాంతం మరింత ఖరీదైన అర్బన్ ప్రాంతమని, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తక్కువ పరిహారం ఇవ్వడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూంకుంట మాదిరి ఇక్కడ కూడా సముచితమైన శాతం మేర పరిహారం పెంచి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల న్యాయమైన డిమాండ్‌కు బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని రామచందర్ రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





