ఉజ్జయిన మహంకాళికి మారు బోనం

– సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంగళవారం మారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి, అర్చకులు మంత్రికి డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలో మారు బోనం సమర్పించారు. బోనమెత్తిన మహిళలకు మంత్రి సురేఖ చీర, సారె అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మారుబోనం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారికి సమర్పించిన బియ్యంతో మారు బోనం చేయడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర  ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లకు తోడు ప్రజల సహకారంతో ఈ ఏడాది బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *