ఇన్ఫ్లుయెన్సర్లది కీలక పాత్ర

– యువత సృజనాత్మకతకు ‘బతుకమ్మ ఛాలెంజ’ వేదిక
– ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా పాలన సమాచారాన్ని సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026లో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశం ఎఫ్‌డీసీ కార్యాలయంలో సోమవారం జరిగింది. దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు ఆధ్వర్యంలో ఇన్ఫ్లుయెన్సర్ జీలా అనిల్ సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ లక్ష్యాలు, పోటీ విధివిధానాలు, వివిధ విభాగాలు, పాల్గొనే విధానం తదితర అంశాలను ఇన్ఫ్లుయెన్సర్లకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యువ కళాకారులు, కంటెంట్ క్రియేటర్లు, ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా భాగస్వాములు కావాలని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్ల విభాగంలో ప్రభుత్వ పథకాలు, ప్రజా పాలనపై రీల్స్, డిజిటల్ స్టోరీ టెలింగ్ ద్వారా కంటెంట్ రూపొందించేందుకు అవకాశం కల్పించారు. యువ ఫిల్మ్ మేకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, సినీ నటుడు రచ్చ రవి, అనిల్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *